హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పేరును మార్చాలని నిర్ణయించారు.
ఇకపై TVVP ను “డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్” గా పిలవనున్నారు. ఈ మార్పుతో TVVP పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
అదే సమయంలో, హైదరాబాద్ మెట్రోపై కూడా క్యాబినెట్ కీలక చర్చలు జరిపింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రోను పూర్తిగా ప్రభుత్వ స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మరియు ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంలో సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.




