పద్మశ్రీ అవార్డు గ్రహీత – క్షిపణి శాస్త్రవేత్త చంద్రమౌళి గడ్డమనుగుణు
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో మధిర వాసి, క్షిపణి శాస్త్రవేత్త చంద్రమౌళి గడ్డమనుగుణు ఎంపిక కావడం గర్వకారణంగా మారింది.
సైన్స్ & ఇంజినీరింగ్ రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసింది.
పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మధిర ప్రాంత ప్రజలు, శాస్త్రవేత్తలు, పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.





