ఖమ్మం జిల్లా | మధిర మండలం | మాటూరు గ్రామం
మధిర మండలం మాటూరు గ్రామానికి చెందిన శ్రీ పడిగల వెంకట కృష్ణా రావు 2025 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నారు.
ఖమ్మం జాతీయ నిర్మాణ రంగ సంస్థలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐ.ఏ.ఎస్ గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రదానం చేయబడింది.
సుదీర్ఘకాలంగా నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న వెంకట కృష్ణా రావు ఈ అవార్డుతో తన పనితనాన్ని మరోసారి చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్తులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.





