ఖమ్మంలో కేంబ్రిడ్జ్ మాంటెస్సోరి ప్రీస్కూల్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవం,ఖమ్మం వార్తలు,Education News,Preschool Events,Cambridge Montessori Khammam

Venkateswara Rao
1 Min Read
Republic Day celebrations at Cambridge Montessori Preschool, KhammamNVR NEWS

ఖమ్మం:
ఖమ్మం నగరంలోని కేంబ్రిడ్జ్ మాంటెస్సోరి ప్రీస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు.

వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరణతో ప్రారంభమై, అనంతరం జాతీయ గీతాలాపన జరిగింది. చిన్నారులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై చిన్న ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు.

అబ్బాయిలు–అమ్మాయిలు వేర్వేరుగా ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలకు నిర్వహించిన ఆటలు, బహుమతుల పంపిణీ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని నింపాయి.

గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు పిల్లలకు సులభమైన విధానంలో వివరించారు. చిన్న వయసులోనే దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలు నేర్పడం ఎంతో ముఖ్యమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *