మధిర వాసికి కేంద్ర ప్రభుత్వ గౌరవం – చంద్రమౌళి గడ్డమనుగుణుకు పద్మశ్రీ అవార్డు ప్రకటన

సాధారణ నేపథ్యం నుంచి పద్మశ్రీ వరకు – స్ఫూర్తిదాయక శాస్త్రవేత్త,దేశ రక్షణకు సేవ చేసిన మౌన వీరుడు, ప్రతిభకు గౌరవం – మధిరకు గర్వకారణం,పని మాట్లాడితే పద్మశ్రీ పలికింది,వెలుగుల్లేని ప్రయాణం… వెలిగిన గౌరవం

Venkateswara Rao
1 Min Read
Highlights
  • సైన్స్ & ఇంజినీరింగ్ రంగంలో విశేష సేవలకు గుర్తింపు కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక భారత రక్షణ పరిశోధనలో కీలక పాత్ర దేశానికి సేవ చేసిన శాస్త్రవేత్తకు జాతీయ గౌరవం

పద్మశ్రీ అవార్డు గ్రహీత – క్షిపణి శాస్త్రవేత్త చంద్రమౌళి గడ్డమనుగుణు

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో మధిర వాసి, క్షిపణి శాస్త్రవేత్త చంద్రమౌళి గడ్డమనుగుణు ఎంపిక కావడం గర్వకారణంగా మారింది.

సైన్స్ & ఇంజినీరింగ్ రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసింది.

పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మధిర ప్రాంత ప్రజలు, శాస్త్రవేత్తలు, పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *