**మధిర గడ్డ.. కాంగ్రెస్ అడ్డా!

Madhira municipal elections, Congress party, Bhatti Vikramarka, roadshow, Madhira news, Telangana politics, development, welfare governance

Venkateswara Rao
1 Min Read

జనసంద్రమైన రోడ్ షోతో తిరుగులేని విజయం ఖాయం**

మధిర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షో మధిరలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జరిగిన ఈ రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

ప్రజా సమస్యలే అజెండాగా, అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భట్టి గారి రాకతో మధిర వీధులన్నీ జనసంద్రమయ్యాయి. డప్పుల మోతలతో మార్మోగిన వాతావరణం, మహిళల హారతులతో వెల్లువెత్తిన ఆశీస్సులు, యువత నినాదాలతో ఉప్పొంగిన ఉత్సాహం ఈ రోడ్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ప్రజలకు భట్టి విక్రమార్క స్పష్టమైన సందేశం ఇచ్చారు. మధిరను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజలే తమ మద్దతుతో గ్యారెంటీ ఇస్తున్నారని ఈ రోడ్ షో స్పష్టంగా చాటిచెప్పింది.

ఇది కేవలం ఎన్నికల ప్రచారం కాదు… మధిర అభివృద్ధికి ప్రజల సంకల్పానికి నిదర్శనం అని స్థానిక నేతలు అభిప్రాయపడ్డారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *