ఆంధ్రప్రదేశ్: గ్రామ సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి నెలలో గ్రామ పంచాయతీల్లో చేసిన తీర్మానాల ప్రకారం నిధులను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం మెజర్మెంట్స్ బుక్స్‌లో నమోదు చేసిన తర్వాత బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించింది.
ఈ నిర్ణయంతో గ్రామాభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుండగా, నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సర్పంచ్‌లకు ఇది పెద్ద ఊరటగా మారింది. త్వరలోనే గ్రామాల్లో పెండింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.




