కేంద్ర బడ్జెట్ 2026–27లో గ్రామీణాభివృద్ధి, AI ఉద్యోగ ప్రభావం, టెక్స్‌టైల్, పోర్టులు, పర్యాటకం, NRI పెట్టుబడులకు పెద్దపీట.

Union Budget 2026–27: Textiles, Tourism, Ayurveda & Stock Market Get Major Push

Venkateswara Rao
1 Min Read

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026–27 దేశ అభివృద్ధికి స్పష్టమైన దిశను చూపిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఖాదీ–చేనేత–హస్తకళల రంగాలకు ప్రోత్సాహం, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్, ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP) వంటి పథకాలతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచనున్నారు.

AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఉద్యోగాలపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి హై లెవల్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం ఈ బడ్జెట్‌లో కీలక అంశం. టెక్స్‌టైల్ రంగానికి వచ్చే ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయించడంతో పాటు, కంటైనర్ తయారీ పరిశ్రమలకు రూ.10,000 కోట్ల పెట్టుబడులతో పోర్టులు, రైల్వే కనెక్టివిటీ బలోపేతం చేయనున్నారు.

ఆయుర్వేద రంగానికి ప్రాధాన్యం ఇస్తూ దేశవ్యాప్తంగా కొత్త ఆల్ ఇండియా ఆయుర్వేద ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి పులికాట్ సరస్సు పరిసరాల్లో ప్రత్యేక రైళ్ల నిర్వహణ, 15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదించారు.

అలాగే NRI పెట్టుబడులను 10 శాతం నుంచి 24 శాతానికి పెంచడం, మహిళల కోసం షీ మార్ట్స్, ఖేలో ఇండియా మిషన్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు వంటి నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి దోహదపడనున్నాయి. రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో రూ.1.40 లక్షల కోట్ల కేటాయింపు ఈ బడ్జెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *