మధిరలో 35 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉపాధ్యాయులు, మధిర వార్తలు, ఎర్రుపాలెం, వైర, టీచర్స్ సన్మానం, విద్యా వార్తలు, తెలంగాణ న్యూస్, శ్రీకృష్ణ సూర్య ట్రస్ట్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ టీచర్స్, teacher felicitation, Madhira news, Telangana education, teachers award, school events

Venkateswara Rao
1 Min Read
ఉపాధ్యాయులు, మధిర వార్తలు, ఎర్రుపాలెం, వైర, టీచర్స్ సన్మానం, విద్యా వార్తలు, తెలంగాణ న్యూస్, శ్రీకృష్ణ సూర్య ట్రస్ట్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ టీచర్స్, teacher felicitation, Madhira news, Telangana education, teachers award, school events

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకే ఉన్నదని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. బుధవారం టీవీఎం పాఠశాలలో శ్రీకృష్ణ సూర్య ట్రస్ట్ వ్యవస్థాపకులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మధిర, ఎర్రుపాలెం, వైర మండలాలకు చెందిన 35 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ అధికారి ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత, ప్రముఖ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, భరత్ విద్యా సంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, శ్రీనిధి స్కూల్ అధినేత సర్పంచ్ బి అంజన బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో గొప్ప విషయం అని అభినందించారు. జిల్లా విద్యాశాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ మురళీమోహన్, రిటైర్డ్ ఎంఈఓ ప్రభాకర్, ఎస్టీఎఫ్ జిల్లా నాయకులు కోటారెడ్డి, పీఆర్‌టీయూ, యూటీఎఫ్ మండల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, వీరయ్య, మాటూరు హెచ్‌ఎం శ్రీహరి, మధిర డివిజన్ ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు సూర్యనారాయణ, మాధవరపు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *