కేంబ్రిడ్జ్ మాంటెసరీ ప్రీ స్కూల్, ఖమ్మం బ్రాంచ్‌లో నిర్వహించిన మొబైల్ అవగాహన కార్యక్రమం మూడో వారం విజయవంతంగా పూర్తయ్యింది. చిన్నారుల్లో మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించడం, పేరెంట్లు–పిల్లల మధ్య అనుబంధాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
మూడు వారాల పాటు విద్యార్థులు మాంటెసరీ విధానంలో చురుకుగా పాల్గొనగా, పేరెంట్ల నుంచి మంచి స్పందన లభించింది. కార్యక్రమంతో ప్రేరణ పొందిన ఒక పేరెంట్ మూడో వారం సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు.





