మూడు సంవత్సరాల ప్రేమకు మలుపు: నిన్న మాటూరులో ధర్నా, పోలీసుల జోక్యం

Three-year love affair ends in protest,Family demands immediate marriage,Police reach the spot

Venkateswara Rao
0 Min Read

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరులో నిన్న జరిగిన ఓ ప్రేమ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మూడు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమికుడు ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని యువతి బంధువులు స్పష్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *