AP: నెట్ జీరో కాన్సెప్ట్‌ను అమలు చేస్తూ అన్ని వనరులను సమగ్రంగా వినియోగించి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
బీసీ సంక్షేమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే పథకాలకు స్పష్టమైన రూపకల్పన చేయాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ (గురుకుల) స్కూల్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.
అదేవిధంగా ‘ఆదరణ–3’ పథకం ద్వారా కుల వృత్తుల వారీగా ఆధునిక పనిముట్ల పంపిణీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.





