గంపలగూడెం మండలం మెట్టగుట్టలో వేంచేసియున్న శ్రీశేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో మంగళవారం శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసస్వామి శేషవాహనంపై ఆశీనులై ఉన్న స్వామివారికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
దేవస్థానంలో ధ్వజస్థంభ ప్రతిష్టా వార్షికోత్సవం సందర్భంగా ప్రధానార్చకులు శ్యాంసుందర శ్రీనివాసాచార్యులు, యోగానందాచార్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు దంపతులతో పాటు పలువురు దంపతులు పీటలపై కూర్చుని కన్యాదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి ఎన్. నారాయణరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు, పి. లక్ష్మణరావు దంపతులతో పాటు ఎం. నరసింహామూర్తి, కె. నాగేశ్వరరావు, వి. కృష్ణారెడ్డి, ఆర్. వెంకటసుబ్బారావు, వై. విజయకుమార్, జి. వెంకటేశ్వరరెడ్డి, ఎస్. పాపారావు పాల్గొన్నారు.
భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు పాలిక చిన్న చెన్నయ్య, పూజిత (తోటమూల – దుర్గా బేకరి) దంపతులు, దాసరి నర్సిరెడ్డి, రామలక్ష్మి (హైదరాబాద్) దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు.










