విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాత పద్ధతిలోనే SSC పరీక్షలు

SSC Exams Telangana, OMR Sheet, Class 10 Exams, Telangana Board Exams, Public Exams, BSE Telangana, SSC Updates, Exam Pattern, Student Alert, Education News

Venkateswara Rao
1 Min Read

రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సమాధాన పత్రానికి (Answer Booklet) ఓఎంఆర్ (OMR) షీట్‌ను జత చేసే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.

విద్యార్థులు పరీక్ష సమయంలో సమాధాన పత్రంతో పాటు ఉన్న ఓఎంఆర్ షీట్‌ను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షా విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నమూనా ఓఎంఆర్ షీట్ మరియు జవాబు పత్రం కాపీలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు
👉 www.bse.telangana.gov.in
👉 https://schooledu.telangana.gov.in
వెబ్‌సైట్ల ద్వారా నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఈ ఫార్మాట్‌పై అవగాహన పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *