ముద్దల్, బాసర, నూజివీడు తదితర త్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 18 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
విద్యార్థులు తమ పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ మే 10 కాగా, ఆఫ్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు మే 20 చివరి తేదీగా నిర్ణయించారు.
ఎంపిక జాబితా మే 30న విడుదల అవుతుంది. జూన్ 5న మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.




