కేంద్ర బడ్జెట్ 2026–27: మైనింగ్ కారిడార్, SME నిధి, జల మార్గాలు, హైస్పీడ్ రైళ్లతో భారత్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్పు

కేంద్ర బడ్జెట్ 2026–27లో మైనింగ్ కారిడార్, SMEలకు రూ.10 వేల కోట్లు, 20 జల మార్గాలు, 7 హైస్పీడ్ రైలు కారిడార్లకు ఆమోదం.

Venkateswara Rao
1 Min Read

కేంద్ర బడ్జెట్ 2026–27లో దేశ ఆర్థిక వృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా మైనింగ్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీతకు ఆయా రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని ఆర్థిక మంత్రి కోరారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి SME అభివృద్ధి నిధి (FFSC) కింద రూ.10,000 కోట్లు కేటాయించగా, చిన్న సంస్థలకు నేరుగా ఆర్థిక సాయం కోసం రూ.2,000 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. MSMEల డబ్బు కొరత సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక వేదికను కూడా రూపొందించనున్నారు.

రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా దేశంలో 20 కొత్త జల మార్గాలు అభివృద్ధి చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో వీటిని ప్రారంభించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయగా, జల రవాణాకు యువతకు శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయనున్నారు.

భారత్‌ను Manufacturing Hubగా తీర్చిదిద్దేందుకు మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు, అలాగే పుణె–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్లు నిర్మించనున్నారు. మొత్తం దేశంలో 7 హైస్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధి ద్వారా నగరాల మధ్య కనెక్టివిటీ పెంచటం, మెరుగైన రవాణా వసతులు కల్పించటం ఈ బడ్జెట్ లక్ష్యంగా పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *