బడ్జెట్‌లో మైక్రో SUV.. సరికొత్తగా హ్యుందాయ్ ఎక్స్‌టర్

Hyundai Exter, Micro SUV, Budget SUV, Hyundai India, Car Launch, Auto News, SUV India, Middle Class Cars, Hyundai Features, New Cars India
Venkateswara Rao
1 Min Read

మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ సరికొత్త ఎక్స్‌టర్ మైక్రో SUVను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వాహనానికి ప్రారంభ ధరను రూ.5,79,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త ఎక్స్‌టర్‌లో డిజైన్ పరంగా పలు మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ముఖ్యంగా తొలిసారిగా ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ ఫీచర్ను అందించడం వినియోగదారులను ఆకర్షించే అంశంగా నిలిచింది.

అదే విధంగా స్పోర్టీ డీ-కట్ స్టీరింగ్ వీల్, లాంగ్ వీల్‌బేస్, 4 సిలిండర్ 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొత్తం 25 రకాల మార్పులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ ద్వారా బడ్జెట్ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *